: మాంచెస్టర్ ఎఫెక్ట్.. యూకేలో ఎన్నికల ప్రచారాలు రద్దు!


ఇంగ్లండ్ లోని మాంచెస్టర్ అరెనాలో ఉగ్రవాదుల దాడి ప్రభావం అక్కడ నిర్వహించనున్న ఎన్నికల ప్రచారంపై పడింది. యూకేలో జనరల్ ఎలక్షన్స్ కు సంబంధించి వచ్చే నెల 8 నుంచి ఎన్నికల ప్రచార కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంది. ఉగ్ర దాడి నేపథ్యంలో ఎన్నికల ప్రచారాలను రద్దు చేస్తున్నట్టు రాజకీయ పార్టీలు ప్రకటించాయి. లేబర్ పార్టీ నేత జెర్మీ కార్బీ ఈ మేరకు ఓ ప్రకటన చేస్తూ ఓ లేఖను ట్వీట్ చేశారు. ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన, గాయపడ్డ కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. కాగా, కన్జర్వేటివ్ పార్టీ కూడా ఈ మేరకు ఓ ప్రకటన చేసింది.

  • Loading...

More Telugu News