: 8,792 రెగ్యుల‌ర్ టీచ‌ర్ల నియామ‌కానికి కేసీఆర్‌ ఆమోదం తెలిపారు: క‌డియం శ్రీహ‌రి


తెలంగాణ రాష్ట్రంలో 8,792 రెగ్యుల‌ర్ టీచ‌ర్ల నియామ‌కానికి సీఎం కేసీఆర్‌ ఆమోదం తెలిపారని ఆ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి క‌డియం శ్రీహ‌రి అన్నారు. దీనిపై త్వరలోనే ప్రకటన వస్తుందని చెప్పారు. అలాగే విద్యా సంవ‌త్స‌రం ఆరంభానికి ముందే విద్యావాలంటీర్ల నియామ‌కం జ‌రుగుతుంద‌ని అన్నారు. విద్యావాలంటీర్ల వేత‌నం రూ.8 వేల నుంచి రూ.12 వేల‌కు పెంచిన‌ట్లు తెలిపారు.

 ప్ర‌స్తుతం డీఎస్సీ విధివిధానాల‌పై క‌స‌ర‌త్తు జ‌రుగుతోందని తెలిపారు. రాష్ట్రంలో 34 కేజీబీవీ భవనాల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం రూ.91.81 కోట్లు మంజూరు చేసిందని వివ‌రించారు. డీఎస్సీ, టెట్‌ల‌ను ఒకేసారి నిర్వహించాలా? వ‌ద్దా? అన్న విష‌యాన్ని ఆలోచిస్తున్నట్లు పేర్కొన్నారు. ఉపాధ్యాయ పోస్టుల భ‌ర్తీకి ప్ర‌క‌ట‌న త్వ‌ర‌లోనే వ‌స్తుందని అన్నారు. టెట్ నిర్వ‌హ‌ణ విష‌యంపై తాము న్యాయ‌శాఖ‌ను కూడా సంప్ర‌దిస్తున్న‌ట్లు చెప్పారు.                                      

  • Loading...

More Telugu News