: చలపతిరావు మాటలకు అర్థం తెలిస్తే, వెంటనే స్పందించే దాన్ని!: రకుల్ ప్రీత్ సింగ్


మహిళలపై సినీ నటుడు చలపతిరావు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వారి సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. చలపతిరావు చేసిన వ్యాఖ్యలను ప్రముఖ నటుడు నాగార్జున ఇప్పటికే ఖండించారు. తాజాగా, ప్రముఖ నటి రకుల్ ప్రీత్ సింగ్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందించింది. ‘తెలుగు భాషపై నాకు సరైన అవగాహన లేకపోవడంతో మహిళలపై చలపతిరావు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు అర్థం వెంటనే తెలుసుకోలేకపోయాను. ఈ విషయమై మీడియాలో వార్తలు రావడంతో, అప్పుడు, అసలు విషయం నాకు అర్థమైంది. ఈ వ్యాఖ్యలపై ఆలస్యంగా స్పందిస్తున్నందుకు క్షమాపణలు. చలపతిరావు మాట్లాడిన మాటలకు అర్థం తెలిసి ఉంటే, వెంటనే, నేను స్పందించి ఉండే దానిని... చలపతిరావు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఐదు నిమిషాల తర్వాత  నాగ చైతన్య, నేను నవ్వుకుంటూ ఉన్న దృశ్యాలను టెలీకాస్ట్ చేశారు. మేము నవ్వుకున్నది ఆ వ్యాఖ్యలకు కాదు’ అని రకుల్ తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొంది.

  • Loading...

More Telugu News