: చలపతిరావు కామెంట్స్ ను నేను సపోర్ట్ చెయ్యలేదు, చెయ్యట్లేదు కూడా!: యాంకర్ రవి
‘రారండోయ్ వేడుక చూద్దాం’ చిత్రం ఆడియో రిలీజ్ ఫంక్షన్ లో మహిళలపై సినీనటుడు చలపతిరావు చేసిన వ్యాఖ్యలపై మహిళా సంఘాలు మండిపడుతున్న విషయం తెలిసిందే. అయితే, చలపతిరావు చేసిన వ్యాఖ్యలకు ..‘సూపర్ సార్’ అంటూ యాంకర్ రవి స్పందించాడు. దీనిపై కూడా మహిళా సంఘాలూ ఆగ్రహం వ్యక్తం చేశాయి. యాంకర్ రవి కనపడితే ‘కాళ్లు విరగ్గొడతామని’ అంటున్నారు. ఈ నేపథ్యంలో యాంకర్ రవి తాజాగా ఓ ట్వీట్ చేశాడు. ‘హే ఫ్రెండ్స్, నేను చలపతిరావు గారి స్టేట్ మెంట్ ని సపోర్ట్ చెయ్యలేదు, చెయ్యట్లేదు. ఈ విషయాన్ని మీరు నమ్మతారని ఆశిస్తున్నా, థ్యాంక్యూ’ అని ఆ ట్వీట్ లో పేర్కొన్నాడు.