: సుఖోయ్-30 యుద్ధ విమానం గల్లంతు
అసోంలో ఈ రోజు మధ్యాహ్నం సుఖోయ్-30 యుద్ధ విమానం గల్లంతైంది. తేజ్‌పూర్‌కు ఉత్తరంలో సుమారు 60 కిలోమీటర్ల దూరంలో వుండగా విమానానికి రాడార్‌తో సంబంధాలు తెగిపోయాయి. దీనిపై అధికారులు విచారణ ప్రారంభించారు. రోజూలాగే సైనికులు ఆ విమానంలో శిక్షణ తీసుకుంటున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుందని సంబంధిత అధికారులు వివరించారు. ఆ సమయంలో సుఖోయ్-30లో ఎంతమంది శిక్షణ తీసుకుంటున్నారన్న విషయం తెలియాల్సి ఉంది.