: డ్రోన్లు చెబుతున్నాయి... జవాన్లు దూసుకెళుతున్నారు!


మావోయిస్టులను సమూలంగా ఏరివేయాలన్న భద్రతా దళాల లక్ష్యానికి మానవ రహిత విమానాలు (డ్రోన్లు - యూఏవీ) తమ వంతు సహకారాన్ని అందిస్తున్నాయి. ఇవి అందిస్తున్న తాజా సమాచారంతో సులువుగా జవాన్లు అడవుల్లోకి దూసుకెళ్లి వారిని చుట్టుముట్టి ఎన్ కౌంటర్ లను విజయవంతం చేస్తున్నారు. ముందుగానే పక్కా సమాచారాన్ని, మావోల కదలికలను పసిగట్టి, ఆ సమాచారాన్ని వీడియో రూపంలో డ్రోన్లు అందిస్తున్నాయి. దీంతో ఓ వ్యూహం ప్రకారం, ముందుకు సాగుతున్న జవాన్లు మావోల ఆటను కట్టిస్తున్నారు.

కాగా, ఇప్పటికే జగదల్ పూర్ లోని సమాచార సేకరణ కేంద్రాన్ని డ్రోన్ ల నుంచి వచ్చే సమాచారాన్ని ఎప్పటికప్పుడు సేకరించి, భద్రతా దళాలకు అందించేలా ఆధునికీకరించారు. అయితే, ఇవి అడవుల్లో నేలపైకి దిగలేకపోవడం ఓ పెద్ద మైనస్ గా భద్రతా దళాలు భావిస్తున్నాయి. ఇక ఈ సమస్యను కూడా అధిగమించేందుకు కేంద్రం ప్రయత్నాలు ప్రారంభించింది. పొదల్లోకి చొచ్చుకెళ్లి చిత్రాలను తీసే రాడార్లు సహా, ఇతర ఆధునిక పరికరాలను కొనుగోలు చేసి అడవుల్లో కూంబింగ్ చేస్తున్న జవాన్లను అందించాలని హోం శాఖ భావిస్తోంది.

  • Loading...

More Telugu News