: నారాయణరెడ్డి రివాల్వర్ తీసుకుపోలేదు... తప్పు ఆయనదే!: కర్నూలు ఎస్పీ


కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం వైసీపీ ఇన్ ఛార్జ్ చెరుకులపాడు నారాయణరెడ్డి దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఆయనతో పాటు ఆయన అనుచరుడిని కూడా దారుణంగా నరికి చంపారు. ఈ నేపథ్యంలో, వైసీపీ నేతలు, కార్యకర్తలు పోలీసుల అలసత్వంపై విమర్శలు గుప్పించారు. నారాయణరెడ్డి రివాల్వర్ లైసెన్స్ ను రెన్యువల్ చేయడంలో పోలీసులు నిర్లక్ష్యం వహించారని విమర్శించారు. ఈ వ్యాఖ్యలను కర్నూలు జిల్లా ఎస్పీ రవికృష్ణ ఖండించారు.

పోలీసులు నిర్లక్ష్యం వహించారని ఆరోపించడం సరైంది కాదని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా స్థానిక పోలీస్ స్టేషన్ లో నారాయణరెడ్డి రివాల్వర్ డిపాజిట్ చేశారని... ఎన్నికల తర్వాత రివాల్వర్ ను ఆయన తీసుకుపోలేదని... ఇది ఆయన తప్పేనని స్పష్టం చేశారు. వెపన్ ను రెన్యువల్ చేసినా, చేయకపోయినా తీసుకెళ్లవచ్చని... తనిఖీల్లో పట్టుబడ్డా లైసెన్స్ కోసం రెన్యువల్ కు దరఖాస్తు చేశామని చెబితే సరిపోతుందని తెలిపారు. వెపన్ ను తీసుకెళ్లాలని తామే మౌఖికంగా పలుసార్లు ఆదేశాలు ఇచ్చినా ఆయన స్పందించలేదని చెప్పారు. నారాయణరెడ్డిని హత్య చేసిన వారిని త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు.

  • Loading...

More Telugu News