: జిల్లాలకు టీడీపీ అధ్యక్షులను ఖరారు చేసిన చంద్రబాబు... ఎవరు ఏ జిల్లాకంటే..!
తెలుగుదేశం పార్టీ జిల్లాల అధ్యక్షుల ఎన్నికపై సీఎం చంద్రబాబు తన కసరత్తును పూర్తి చేశారు. శ్రీకాకుళం జిల్లా తెదేపా అధ్యక్షురాలిగా గౌతు శిరీష పేరును ఆయన ఎంపిక చేసినట్టు సమాచారం. విశాఖపట్నం నగర అధ్యక్షుడిగా వాసుపల్లి గణేష్, విశాఖ జిల్లా అధ్యక్షుడిగా పి.రమేష్ బాబు, తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడిగా నామన రాంబాబు, పశ్చిమ గోదావరి జిల్లాకు తోట సీతారామలక్ష్మిని ఆయన ఖరారు చేశారు.
కీలకమైన కృష్ణా జిల్లా తెలుగుదేశం అధ్యక్షుడిగా బచ్చుల అర్జునుడు, విజయవాడ అర్బన్ కు బుద్ధా వెంకన్న, గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా జీవీ ఆంజనేయులు, ప్రకాశం జిల్లాకు దామచర్ల జనార్దన్, నెల్లూరు జిల్లాకు బీద రవిచంద్ర, చిత్తూరు జిల్లాకు పులివర్తి నాని, అనంతపురం జిల్లాకు బీకే పార్థసారధి, కడప జిల్లాకు శ్రీనివాసరెడ్డి, కర్నూలు జిల్లాకు సోమిశెట్టి వెంకటేశ్వర్లును పార్టీ అధ్యక్షులుగా చంద్రబాబు నియమించారు. ఇక విజయనగరం జిల్లా తెలుగుదేశం అధ్యక్షుడి ఎన్నిక మాత్రం పెండింగ్ లో ఉండిపోయింది.