: విస్తరిస్తున్న రుతుపవనాలు... తొలకరి తేదీలు ప్రకటించిన వాతావరణ శాఖ
గత వారంలో అండమాన్, నికోబార్ దీవులను తాకిన నైరుతి రుతుపవనాలు శరవేగంగా విస్తరిస్తున్న వేళ, తొలకరి వర్షాల కోసం ఎదురు చూస్తున్న రైతులకు వాతావరణ శాఖ తీపి కబురు చెప్పింది. జూన్ 3వ తేదీ నాటికి రుతుపవనాలు రాయలసీమను తాకుతాయని అంచనా వేస్తున్నట్టు అధికారులు తెలిపారు. ఆపై 7వ తేదీ నాటికి ఉత్తర తెలంగాణ, ఉత్తర కోస్తా సహా రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపారు. నేడో, రేపో కేరళను రుతుపవనాలు తాకుతాయని వెల్లడించారు. భూ ఉపరితలంపై ఎల్ నినో ద్రోణులు కొనసాగుతున్నందున మరో మూడు నాలుగు రోజుల పాటు భానుడి భగభగలు కొనసాగుతాయని తెలిపారు.