: గతేడాది 24 లక్షలమంది సొంత ప్రాంతాలను వదిలేశారు.. అంతర్గత వలసల్లో భారత్‌ది మూడోస్థానం!


దేశీయ వలసల్లో భారత్ మూడో స్థానంలో నిలిచింది. గతేడాది 24 లక్షల మంది పొట్ట చేతపట్టుకుని ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి చేరుకున్నట్టు అంతర్గత వలసల పర్యవేక్షణ కేంద్రం (ఐడీఎంసీ), నార్వేజియన్ శరణార్థుల మండలి (ఎన్ఆర్ఐ‌సీ) కలిసి సంయుక్తంగా ఓ నివేదికను విడుదల చేశాయి. దాని ప్రకారం చైనాలో అత్యధికంగా 74 లక్షల మంది దేశంలోనే వలసలు వెళ్లగా  59 లక్షల మందితో ఫిలిప్పీన్స్, 24 లక్షల మందితో భారత్ ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. వలసలకు ప్రధాన కారణం ప్రకృతి విపత్తులు, హింస, ఘర్షణలేనని నివేదిక పేర్కొంది. ఈ కారణంగానే ప్రపంచవ్యాప్తంగా గతేడాది 3.1 కోట్ల మంది స్వదేశాల్లోనే వలసలు వెళ్లారని తెలిపింది. గతేడాది జూలై-అక్టోబరు మధ్య బీహార్‌లో సంభవించిన వరదల వల్ల ఏకంగా 16 లక్షల మంది తమ నివాసాలను మార్చుకున్నట్టు నివేదిక వివరించింది.  

  • Loading...

More Telugu News