: నా ఎదుగుదల వెనక టాలీవుడ్.. మొదటి సినిమా తెలుగులోనే.. గుర్తు చేసుకున్న బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్


తనకు తెలుగు చిత్రపరిశ్రమే జీవితాన్ని ఇచ్చిందని బాలీవుడ్ ప్రముఖ నటుడు అనిల్ కపూర్ గుర్తు చేసుకున్నాడు. రియల్ ఎస్టేట్ సంస్థ డ్రీమ్ ఇండియాకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న అనిల్ కపూర్ సోమవారం ఆ సంస్థ హైదరాబాద్‌లోని హోటల్ తాజ్‌కృష్ణలో నిర్వహించిన ఓ కార్యక్రమానికి హాజరయ్యాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న సమయంలో తనను అక్కున చేర్చుకున్నది తెలుగు చిత్రపరిశ్రమేనని పేర్కొన్నాడు. ప్రముఖ దర్శకుడు బాపు తెరకెక్కించిన 'వంశవృక్షం' సినిమాతోనే తన సినీ ప్రస్థానం మొదలైందని గుర్తు చేసుకున్నాడు. హైదరాబాద్‌లో తాను చాలా సినిమాల కోసం పనిచేశానని, ఇక్కడి సాంకేతిక నిపుణుల్లో వృత్తి పట్ల భక్తిభావం, నిజాయతీ, అంకితభావం తనను ఆకట్టుకున్నాయన్నాడు. రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులకు హైదరాబాదును మించినది దేశంలోనే లేదని అనిల్ పేర్కొన్నాడు.

  • Loading...

More Telugu News