: ఆత్మాహుతి దాడిని ఖండించిన ప్రధాని నరేంద్ర మోదీ


ఇంగ్లాండ్ లోని మాంచెస్టర్‌ ఎరీనాలో అరియాణా గ్రాండే సంగీత కచేరిలో చోటుచేసుకున్న ఆత్మాహుతి దాడిని ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా ఖండించారు. దీనిని ఉగ్రవాదుల పిరికిపంద చర్యగా అభివర్ణించారు. ఈ ఘటనతో దిగ్భ్రాంతికి గురయ్యానని ఆయన తెలిపారు. మృతుల కుటుంబాలకు ఆయన తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

మరోవైపు హాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా ఈ ఘటనపై స్పందిస్తూ... దిగ్భ్రాంతికి గురయ్యానని తెలిపింది. ఈ కాన్సెర్ట్ కు హాజరైన వారిలో ఎక్కువ మంది టీనేజర్లు ఉన్నారని, అన్నెంపున్నెం ఎరుగని వారిని ఆత్మాహుతి దాడితో హతమార్చడం దారుణమని అభిప్రాయపడింది. మృతులకు సంతాపం తెలుపుతున్నానని చెప్పింది. 

  • Loading...

More Telugu News