: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అమితాబ్ ట్వీట్
బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్ కు క్రికెట్ అంటే వల్లమాలిన ప్రేమ... క్రికెట్ ను ఆయన ఫాలో అవుతుంటారు. బిజీగా ఉన్నప్పటికీ ఆయన ఆటను ఆస్వాదిస్తుంటారు. కుదిరితే స్టేడియంకు కూడా వచ్చి ఆటగాళ్లను ఉత్సాహపరుస్తుంటారు. అలాంటి అమితాబ్ కు ఆదివారం జరిగిన ఫైనల్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ స్కోరు నచ్చలేదు. కేవలం 129 పరుగులకే పరిమితం కావడానికి తోడు, స్మిత్, ధోనీ వంటి కీలక ఆటగాళ్లు ఉన్న జట్టు కావడం, అంతకు ముందు జరిగిన నాకౌట్ స్టేజ్ మ్యాచ్ లో పూణే చేతిలో ఓటమిపాలు కావడం నేపథ్యంలో ఫైనల్ లో కూడా ఓటమిపాలవుతామని భావించారు.
దీంతో ముంబై జట్టు ఓటమిని జీర్ణించుకోలేక.. టీవీ కట్టేశారు. అయితే మ్యాచ్ ముగిసిన అనంతరం తన కుమారుడు అభిషేక్ బచ్చన్ ఫోన్ చేసి, ముంబై ఇండియన్స్ ఒక్క పరుగుతేడాతో విజయం సాధించారని తెలపడంతో ఆశ్చర్యపోయారు. గెలిచిన విధానాన్ని తెలుసుకుని... ఆయన తన ట్విట్టర్ లో 'తుమ్ అపున్ కో దస్ మారా...అపున్ ఏక్ మారా...సాలిడ్ మారా' (మీరు మమ్మల్ని పది సార్లు ఓడించారు...మేము మిమ్మల్ని ఒక్కసారే ఒడించాం...అయితే మర్చిపోలేని విధంగా ఓడించాం ) అంటూ ట్వీట్ చేశారు.