: ఈ బామ్మే నిన్న ముంబయి ఇండియన్స్ ని గెలిపించిందట.. ‘బామ్మ ప్రార్థన’ ఫొటో ట్విట్టర్ లో హల్ చల్!


నిన్న జ‌రిగిన ఐపీఎల్‌-10 ఫైన‌ల్ మ్యాచ్‌లో రైజింగ్‌ పుణె సూపర్‌ జెయింట్‌పై ముంబయి ఇండియన్స్ ఒక్క ప‌రుగు తేడాతో గెలిచి క‌ప్పుకొట్టేసిన విష‌యం తెలిసిందే. చివ‌రి వ‌ర‌కు నువ్వా-నేనా అంటూ జ‌రిగిన ఈ మ్యాచ్ అభిమానుల‌లో ఎంతో ఆస‌క్తిరేపింది.
అయితే, హైద‌రాబాద్‌లోని ఉప్ప‌ల్ స్టేడియంలో జ‌రిగిన ఈ మ్యాచ్‌ను చూడ‌డానికి వ‌చ్చిన ఓ బామ్మ ముంబ‌యి ఇండియన్స్ గెలవాల‌ని రెండు చేతులు క‌లిపి దేవుడిని వేడుకుంది. అదే స‌మ‌యంలో ఓ కెమెరా ఆమె వైపున‌కు తిరిగింది.

 చివరి ఐదు బంతుల్లో 7 పరుగులు చేస్తే గెలుపు పుణె సొంతమవుతుంద‌న్న స‌మ‌యంలో క్రీజులో స్టీవ్‌స్మిత్‌, మనోజ్‌ తివారీ ఉన్నారు. స్టేడియంలో ఆ బామ్మ‌ దేవుడికి ప్రార్థన చేస్తూ కనిపించారు. ఆ బామ్మ‌ను పదే పదే టీవీలో చూపించారు.  చివ‌రికి ఒక్క పరుగు తేడాతో ముంబయి విజయం సాధించడంతో ఆ బామ్మ ప్రార్థన ఫ‌లించింద‌ని సోష‌ల్ మీడియాలో యూజ‌ర్లు తెగ‌పోస్టులు చేసేస్తున్నారు. ఆ బామ్మ‌కు థ్యాంక్స్ అని ఒక‌రు... ఆ బామ్మ గ్రేట్ అని మ‌రొక‌రు... ఆ బామ్మే మ్యాచ్‌ని గెలిపించింద‌ని మరొక‌రు.. ఇలా సోష‌ల్ మీడియాలో ఆ బామ్మ ఫుల్‌గా ఫేమ‌స్ అయిపోయింది. ఇంతకీ ఆ బామ్మ ముంబయి ఫ్రాంచైజీ యజమానురాలు నీతా అంబాని అమ్మ పూర్ణిమా బెన్‌ దలాల్‌. ఆమెను అంద‌రూ నానీ అని పిలుచుకుంటారు. ముంబయి ఇండియన్స్ ట్విట్టర్ పేజీలో కూడా ఈ బామ్మకు థ్యాంక్స్ చెబుతూ పోస్ట్ చేశారు.








  • Loading...

More Telugu News