: ధోనీ బౌండరీ కొట్టినప్పుడు కేరింతలు కొట్టి మీడియాకు బుక్కయిన బాలీవుడ్ ప్రేమ జంట!
బాలీవుడ్ నటులు సుశాంత్ సింగ్ రాజ్ పుత్, కృతి సనోన్ మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోందని బాలీవుడ్ లో కథనాలు వెలువడిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ కలిసి నటించిన 'రాబ్తా' షూటింగ్ సందర్భంగా కలిగిన సాన్నిహిత్యం చాలా దూరం వెళ్లిందని, అందుకు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తన ప్రేయసి అంకితా లోఖండేకు గుడ్ బై చెప్పేశాడని కథనాలు వెలువడ్డాయి. తాజాగా వీరిద్దరూ నిన్న హైదరాబాదులోని ఉప్పల్ లో రైజింగ్ పూణే సూపర్ జెయింట్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ వీక్షిస్తూ మీడియా కంటబడ్డారు.
దీంతో మరోసారి వీరి ప్రేమ వ్యవహారం టాక్ ఆఫ్ ది బాలీవుడ్ అయింది. వీరి ప్రేమ వ్యవహారం చాలా దూరం వెళ్లిందని గుసగుసలు వినబడుతున్నాయి. కాగా, నిన్నటి మ్యాచ్ లో రెండు జట్లలోని కీలక ఆటగాళ్లు ఆడినప్పుడు హల్ చల్ చేసిన సుశాంత్ సింగ్... ధోనీ బౌండరీ కొట్టిన సమయంలో కేరింతలు కొట్టాడు. ఈ సమయంలో కృతి సనోన్ ను సుశాంత్ పక్కన చూసిన మీడియాకి మంచి పనిదొరికింది. దీంతో మరోసారి వారి ప్రేమ వ్యవహారం మీడియాకెక్కింది. కాగా, ధోనీ సినిమాలో సుశాంత్ టైటిల్ రోల్ పోషించిన సంగతి తెలిసిందే.