: మా అక్కతో నాకు విభేదాలా?...రూమర్లే: కంగనా చెల్లెలు రంగోలి


తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని ప్రముఖ బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ సోదరి రంగోలి స్పష్టం చేసింది. కంగనాకు తన సొంత అక్కాచెల్లెళ్లతోనే పడటం లేదని, వారి మధ్య విభేదాలున్నాయంటూ మీడియాలో కధనాలు రావడంతో రంగోలి స్పందించింది. తన సోదరి తనను కెరీర్ ఆరంభం నుంచీ తన దగ్గరే ఉంచుకుంటోందని తెలిపింది. ఆమె తమకు అండగా ఉండడమే కాకుండా, తమకు జీవితాన్నిచ్చిందని తెలిపింది. ప్రస్తుతం తాను గర్భవతిని కావడం వల్లే విశ్రాంతి తీసుకుంటున్నానని, అంతే తప్ప తమ మధ్య విభేదాలు లేవని, రావని స్పష్టం చేసింది. కంగనా షెడ్యూల్ మొత్తం చూసుకునే రంగోలి ఈ మధ్యకాలంలో కంగనా పక్కన కనపడకపోవడంతో ఊహాగానాలు చక్కర్లు కొట్టాయి.

  • Loading...

More Telugu News