: రైఫిళ్లతో పారిపోయిన కానిస్టేబుల్ ఉగ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిదీన్ లో చేరాడు!


జమ్ముకశ్మీర్‌ లో నాలుగు రైఫిళ్లతో పారిపోయిన పోలీస్ కానిస్టేబుల్ సయ్యద్ నవీద్ ముస్తాఖ్ ఉగ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిదీన్‌ లో చేరడం కలకలం రేపుతోంది. శనివారం బుద్గామ్ జిల్లా ఎఫ్సీఐ కార్పొరేషన్ వేర్‌ హౌస్ నుంచి నాలుగు రైఫిళ్లను దొంగిలించి, వాటితో కానిస్టేబుల్ సయ్యద్ నవీద్ ముస్తాఖ్ పారిపోయాడు. దీంతో అతనికోసం పోలీసులు గాలిస్తుండగా...ఆయన హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థలో చేరాడని గుర్తించారు. కాగా, కశ్మీర్ లోని షోపియాన్ జిల్లా నజ్నీన్‌ పురాకు చెందిన సయ్యద్ నవీద్ ముస్తాఖ్ 2012లో పోలీస్‌ కానిస్టేబుల్‌ గా ఎంపికయ్యాడు. 

  • Loading...

More Telugu News