: ఎల్లుండి నుంచి కేసీఆర్ క్రికెట్ కప్ ప్రారంభం
తమ సర్కారు క్రీడాకారులకు మంచి ప్రోత్సాహం అందిస్తుందని నిజామాబాద్ ఎంపీ కవిత అన్నారు. ప్రతి ఏడాది నిజామాబాద్‌లో కేసీఆర్ క్రికెట్ కప్ ను నిర్వహించనున్నామని తెలిపారు. ఈ రోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ... క్రీడాకారులను ప్రోత్సహించేందుకే ఈ క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. కేసీఆర్ క్రికెట్ కప్ పోటీలు ఎల్లుండి నుంచి ప్రారంభం కానున్నాయి. నిజామాబాద్ పట్టణ శివారులోని నాగారం రాజారాం మైదానంలో జరగనున్న ఈ పోటీల్లో తెలంగాణకు చెందిన పలు జట్లతో పాటు ఇతర రాష్ట్రాల జట్లు కూడా పాల్గొంటాయి. టైటిల్ విజేతకి ట్రోఫీతో పాటు రూ.3 లక్షల నగదు అందిస్తారు. రన్నరప్‌గా నిలిచే జట్టుకి ప్రోత్సాహక బహుమతిగా రూ.1.5 లక్షలు అందిస్తారు.