: ఐపీఎల్ ట్రోఫీని గెలిచిన ముంబై యాజమాన్యం దానిని ఎక్కడికి తీసుకెళ్లిందో తెలుసా?
గత రాత్రి జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ లో రైజింగ్ పూణే సూపర్ జెయింట్ జట్టుపై ముంబై ఇండియన్స్ జట్టు విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో సంబరాల అనంతరం ఆటగాళ్లు ఉదయమే ఎవరి ఊళ్లకు వాళ్లు వెళ్లిపోయారు. అయితే విజేతగా నిలిచిన జట్టు యాజమాన్యం మాత్రం నేరుగా విమానాశ్రయం నుంచి ముంబైలో ప్రసిద్ధి గాంచిన శ్రీ సిద్ధి వినాయక దేవాలయానికి ట్రోఫీని తీసుకెళ్లారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ట్రోఫీని అంబానీ సోదరుల ఇంటికి తీసుకెళ్లారు. ట్రోఫీ గెల్చిన ఆనందంతో ఆటగాళ్లంతా దానితో ఫోటోలకు పోజులిచ్చి ఆకట్టుకున్నారు.