: అంబటి రాయుడుకి సచిన్ ముచ్చటైన కానుక!


ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ జట్టు సభ్యుడైన హైదరాబాదీ అంబటి రాయుడుకి దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్ బహుమతి అందజేశాడు. గతరాత్రి హైదరాబాదులోని ఉప్పల్ స్టేడియంలో రైజింగ్ పూణే సూపర్ జెయింట్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరిగిన ఫైనల్ లో ముంబై ఇండియన్స్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. విజయం సాధించిన అనంతరం డ్రెస్సింగ్ రూంలో ఆటగాళ్లు సంబరాలు చేసుకున్నారు. ఈ సంబరాల్లో సచిన్ కూడా పాల్గొన్నాడు. ఈ సందర్భంగా అంబటి రాయుడుకి సచిన్ బ్యాటును బహూకరించాడు. ఈ బ్యాట్ పై సచిన్ స్వయంగా సంతకం చేశాడు. తన అభిమాన ఆటగాడి నుంచి బ్యాటును బహుమతిగా అందుకున్న అంబటి రాయుడు ఉబ్బితబ్బిబ్బయ్యాడు. 

  • Loading...

More Telugu News