: రేపే భారతీయ మార్కెట్లోకి రెడ్ మి 4 స్మార్ట్ ఫోన్... అమెజాన్‌లో ఆఫర్లు
షియోమి ఇటీవలే విడుదల చేసిన రెడ్ మి 4 స్మార్ట్ ఫోన్లు రేపు భారత్‌లో విడుదల కానున్నాయి. ఆన్‌లైన్ ద్వారా రేపు అమ్మకానికి ఉంచనున్న ఈ స్మార్ట్‌ఫోన్ కోసం ఎంతో మంది ఎదురుచూస్తున్నారు. రెడ్ మీ ఫోన్లు ఆన్‌లైన్‌లో పెట్టిందే ఆలస్యం.. నిమిషాల వ్యవధిలోనే అన్నీ అమ్ముడుపోతాయన్న విషయం తెలిసిందే. ఈ స్మార్ట్ ఫోన్‌ను అమెజాన్ ఇండియా, మి.కామ్ లలో కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌ను అమెజాన్ ఇండియాలో కొనుగోలు చేస్తే వొడాఫోన్ నెట్ వర్క్ పై 45జీబీ ఉచిత డేటాను ఐదు నెలల పాటు అందుకోవచ్చు. ఇందుకోసం వొడాఫోన్ 1జీబీ లేదా 4జీ డేటా ప్యాక్ ను మాత్రం కస్టమర్లు రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది.
మరోవైపు యస్ బ్యాంకు డెబిట్, క్రెడిట్ కార్డుతో ఈ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేస్తే 500 రూపాయల క్యాష్ బ్యాక్ ను పొందవచ్చు. రెడ్ మి 4 స్మార్ట్‌ఫోన్ 2జీబీ ర్యామ్/ 16జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 6,999 రూపాయలుగా ఉంది. 3జీబీ వేరియంట్/32జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 8,999 రూపాయలుగా ఉంది.