: బరితెగించిన కశ్మీర్ వేర్పాటువాదులు... క్రికెట్ మ్యాచ్ సందర్భంగా పాక్ జాతీయగీతం ఆలాపన!


జమ్ముకశ్మీర్ లోని వేర్పాటువాదులు మరోసారి బరి తెగించారు. పుల్వామా జిల్లాలో జరిగిన ఓ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా పాక్ జాతీయగీతాన్ని ఆలపించారు. పుల్వామా హంటర్స్, పాంపోరా ఎలెవెన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. అయితే భారత వ్యతిరేక నినాదాలు చేసిన వారిని కాని, మ్యాచ్ నిర్వాహకులను కాని ఇంతవరకు పోలీసులు అరెస్టు చేయలేదు. హిజ్బుల్ మిలిటెంట్ బుర్హాన్ వనీని ఎన్ కౌంటర్ చేసినప్పటి నుంచి జమ్ముకశ్మీర్ అట్టుడుకుతున్న సంగతి తెలిసిందే. 

  • Loading...

More Telugu News