: ట్రిపుల్ తలాక్ పై వెనక్కి తగ్గిన ముస్లిం లా బోర్డు
ముస్లిం మహిళల జీవితాలను కాటు వేస్తున్న ట్రిపుల్ తలాక్ అంశంపై ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు వెనక్కి తగ్గింది. సుప్రీంకోర్టులో 13 పేజీల అఫిడవిట్ దాఖలు చేసింది. ఇందులో ట్రిపుల్ తలాక్ సరైన విధానం కాదని పేర్కొంది. ట్రిపుల్ తలాక్ ను ఆమోదించవద్దని దేశంలోని ఖాజీలకు సమాచారం ఇస్తామని తెలిపింది.