: శభాష్! అమెరికా, జపాన్ లలోని లక్ష్యాలను చేరేశాం... మరిన్ని ప్రయోగాలు చేయండి: కిమ్ జాంగ్ ఉన్ ఆదేశం


అమెరికా, జపాన్, దక్షిణ కొరియాలతో పాటు ప్రపంచానికి ముచ్చెమటలు పట్టిస్తున్న ఉత్తరికొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ ఆదివారం చేసిన ప్రయోగంతో ఫుల్ ఖుషీ అయిపోయాడు. ఈ సందర్భంగా సైనికాధికారులతో పాటు, శాస్త్రవేత్తలను కూడా ఆయన అభినందించారు. ఇంటర్మీడియెట్ బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం విజయవంతమైందని ప్రకటించారు. ఈ ప్రయోగంతో అమెరికా, జపాన్ దేశాలలోని లక్ష్యాలను చేరుకోగలమని ఆయన చెప్పారు. దీని స్పూర్తితో అమెరికా, జపాన్ లలోని టార్గెట్స్ ను చేరుకోగల మరిన్ని క్షిపణులను తయారు చేయాలని ఆయన సూచించారు. అమెరికా, ట్రంప్ విధానాలకు సరైన సమాధానం అదేనని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అమెరికా, జపాన్ లకు చెందిన పలువురు ఉన్నతాధికారులు భేటీఅయి పరిస్థితిని సమీక్షిస్తున్నట్టు తెలుస్తోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విదేశీ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. 

  • Loading...

More Telugu News