: అమెరికాలో కేటీఆర్ బిజీబిజీ
అమెరికా పర్యటనలో ఉన్న తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అక్కడ పలువురితో భేటీ అవుతూ బిజీబిజీగా ఉన్నారు. కాలిఫోర్నియాలోని శాక్రమెంటోలో ఎన్‌ఆర్‌ఐలతో భేటీ అయిన కేటీఆర్.. తెలంగాణ రాష్ట్ర సర్కారు చేపట్టిన కార్యక్రమాలు, పథకాలను వివరించారు. ఎన్‌ఆర్‌ఐలు రాష్ట్ర సాధనకు సహకరించినట్లే, ఇప్పుడు అభివృద్ధిలోనూ భాగస్వామ్యులు కావాలని ఆయన కోరారు. తెలంగాణలోని గ్రామాల్లో పాఠశాలలు, ఆసుపత్రులు, గ్రంథాలయాల అభివృద్ధికి ఎన్ఆర్ఐలు సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు. కాగా, ఖమ్మంలో ఐటీ పరిశ్రమ ఏర్పాటుకు ఎన్‌ఆర్‌ఐలు ముందుకొచ్చినట్లు కేటీఆర్ మీడియాకు చెప్పారు.