: హత్య గురించి నారాయణరెడ్డి కారు డ్రైవర్ ఏం చెప్పాడంటే..!


కర్నూలు జిల్లా పత్తికొండ వైసీపీ ఇన్ ఛార్జ్ చెరకులపాడు నారాయణరెడ్డి హత్య పక్కా ప్రణాళిక ప్రకారమే జరిగిందని ఆయన కారు డ్రైవర్ ఎల్లప్ప తెలిపాడు. హత్య జరిగిన తీరును ఆయన ఓ మీడియా సంస్థకు వెల్లడించాడు. రామకృష్ణాపురం సమీపంలో ఉన్న కల్వర్టు వద్ద దుండగులు దాక్కున్నారని... కారు అక్కడకు రాగానే ఒక్కసారిగా 20 మంది వేట కొడవళ్లతో దాడి చేశారని చెప్పాడు. నారాయణరెడ్డిని విచక్షణారహితంగా నరికారని... అడ్డుకోబోయిన సాంబశివుడిని కూడా అత్యంత దారుణంగా హతమార్చారని తెలిపాడు. ఆ తర్వాత వారంతా పారిపోయారని చెప్పాడు. దుండగులు తరమడంతో తాను అక్కడ నుంచి వెళ్లిపోయినట్టు చెప్పాడు. మరోవైపు కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో నారాయణరెడ్డి, సాంబశివుడు మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించారు. 

  • Loading...

More Telugu News