: అందుకు ఇదే సరైన సమయమని అనుకుంటున్నాను: ఐశ్వ‌ర్య రాయ్


త‌న‌ని అందరూ సోషల్‌మీడియా ద్వారా అభిమానులతో టచ్‌లో ఉండొచ్చు కదా అని అడుగుతుంటారని బాలీవుడ్ న‌టి, మాజీ ప్ర‌పంచ సుంద‌రి ఐశ్వ‌ర్య రాయ్ పేర్కొంది. అందుకు తాను ఇదే సరైన సమయమని అనుకుంటున్నానని చెప్పింది. దీంతో ఆమె ఇక సోష‌ల్ మీడియాలో త్వ‌ర‌లోనే అడుగుపెట్టేస్తుంద‌ని అభిమానులు భావిస్తున్నారు. అమితాబ్ బ‌చ్చ‌న్, అభిషేక్ బ‌చ్చ‌న్‌లు సోష‌ల్ మీడియాను అధికంగానే ఉప‌యోగిస్తుంటారు. అమితాబ్ అయితే, ట్విట్ట‌ర్ ద్వారా త‌న అభిమానుల‌కు ఎప్పుడూ ట‌చ్‌లోనే ఉంటారు. ఐశ్వ‌ర్య రాయ్‌కి మాత్రం సోష‌ల్ మీడియా అంటే అంత‌గా ఇష్టం ఉండ‌దు. ఓ సారి ఆమె దీని గురించి మాట్లాడుతూ... సోష‌ల్ మీడియా మనుషుల్ని బద్ధకంగా మారుస్తుందని, ఆ అల‌వాటు ఎక్కువయ్యే కొద్దీ మనుషులు మనుషులతో కాకుండా గ్యాడ్జెట్లతోనే మాట్లాడుకుంటున్నారని పేర్కొంది.

  • Loading...

More Telugu News