: రజనీకాంత్ ఇంటి వద్ద భారీగా మోహరించిన పోలీసులు!
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ రంగ ప్రవేశంపై ఊహాగానాలు ఊపందుకుంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రజనీకాంత్ స్థానికత అంశాన్ని ఆందోళనకారులు లేవనెత్తారు. దీంతో ముందస్తు చర్యల్లో భాగంగా రజనీకాంత్ ఇంటి ముందు భారీగా పోలీసులను మోహరించారు. కాగా, రజనీకాంత్ స్థానికతపై ఇప్పటికే పలు విమర్శలు వచ్చాయి. ఇదిలా ఉండగా, దేవుడు ఆదేశిస్తే తాను రాజకీయాల్లోకి వస్తానని చెబుతున్న రజనీ, ప్రధాని నరేంద్ర మోదీని త్వరలో కలవనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.