: శంషాబాద్ ఎయిర్ పోర్టులో అమిత్ షాకు ఘనస్వాగతం
తెలంగాణలో మూడు రోజుల పర్యటన నిమిత్తం బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా హైదరాబాద్ కు చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఆయనకు బీజేపీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి నల్గొండ జిల్లా పర్యటనకు అమిత్ షా బయలుదేరి వెళ్లారు. కాగా, అమిత్ షా పర్యటనలో నాలుగు అంచెల భద్రతను కల్పిస్తున్నామని పోలీస్ అధికారులు తెలిపారు. అమిత్ షా పర్యటించనున్న ప్రాంతాలన్నీ పోలీసుల నిఘాలోనే ఉంటాయని, ప్రత్యేక పాసులు ఉంటేనే ఆయా కార్యక్రమాలకు అనుమతి ఇస్తామని తెలిపారు.