: సచిన్ టెండూల్కర్ ను ఇంటర్వ్యూ చేసిన రకుల్ ప్రీత్ సింగ్


క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ను టాలీవుడ్ నటి రకుల్ ప్రీత్ సింగ్ ఇంటర్వ్యూ చేసింది. సచిన్ నటించిన 'సచిన్ - ఎ బిలియన్ డ్రీమ్స్' సినిమా వచ్చే శుక్రవారంనాడు విడుదల కానుంది. ఈ నేపథ్యంలో, సినిమా ప్రమోషన్ లో భాగంగా సచిన్ హైదరాబాద్ వచ్చాడు. తాను ఎంతో ఇష్టపడే సచిన్ ను ఈ సందర్భంగా రకుల్ ప్రీత్ ఇంటర్వ్యూ చేసింది. ఆయన జీవితానికి సంబంధించి పలు ప్రశ్నలను సంధించింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ఆమె తన అభిమానులతో పంచుకుంది. క్రికెట్ లెజెండ్ ను ఇంటర్వ్యూ చేయడం ఎంతో ఆనందంగా ఉందని ఆమె ట్వీట్ చేసింది. ఆయన జీవితం ఎంతో మందికి ఆదర్శమని...  ఆయన నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని తెలిపింది. 

  • Loading...

More Telugu News