: త్వరలోనే ట్రిపుల్ తలాక్ రద్దుపై చట్టం!: వెంకయ్య నాయుడు
ముస్లిం మహిళలకు ప్రాణాంతకంగా అవతరించిన ట్రిపుల్ తలాక్ ను రద్దు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం త్వరలోనే చట్టాన్ని తీసుకురానుంది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. అయితే ముస్లింలు దీనిపై సానుకూల అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తేనే అమలు చేస్తామని చెప్పారు. ట్రిపుల్ తలాక్ పై కేంద్రం ఓ స్థిరమైన అభిప్రాయంతో ఉందని తెలిపారు. మన సమాజంలో ఉన్నటువంటి బాల్య వివాహాలు, సతీ సహగమనం, వరకట్నాలు వంటివి ఇప్పటికే అంతరించిపోయాయని... ట్రిపుల్ తలాక్ విషయంలో కూడా ఇదే మార్పు రావాల్సి ఉందని చెప్పారు. లింగ వివక్ష సమాజానికి ఎంతమాత్రం మంచిది కాదని అన్నారు. ముస్లిం మహిళలు కూడా న్యాయపరమైన అంశాలను తెలుసుకోవాల్సి ఉందని సూచించారు.