: నారాయణరెడ్డి హత్య కేసు.. డిప్యూటీ సీఎం కేఈ తనయుడిపై కేసు నమోదు
వైఎస్సార్సీపీ నేత నారాయణరెడ్డి, ఆయన అనుచరుడు సాంబశివుడు హత్య కేసుకు సంబంధించి డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి తనయుడు శ్యామ్ బాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు. శ్యామ్ బాబు సహా 13 మందిపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. కాగా, ఈ కేసులో ప్రధాన నిందితుడు శ్యామ్ బాబు అని, అయినప్పటికీ అతన్ని ఎ-14గా చేరుస్తూ కేసు నమోదు చేశారని వైఎస్సార్సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ కేసు నుంచి శ్యామ్ బాబును తప్పించేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు.