: ఆ జంట హత్యలతో నాకు సంబంధం లేదు: డిప్యూటీ సీఎం కేఈ వివరణ


నారాయణరెడ్డి హత్యకు గురికావడం వెనుక ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి హస్తముందంటూ వైఎస్సార్సీపీ నేతలు ఆరోపణలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేఈ స్పందిస్తూ, ‘ఉద్దేశపూర్వకంగానే వైఎస్సార్సీపీ నాపై నిందలు వేస్తోంది. నారాయణరెడ్డి, ఆయన అనుచరుడు సాంబశివుడు హత్యలతో నాకు సంబంధం లేదు. వాళ్లిద్దరినీ నా అనుచరులే చంపారని విచారణలో తేలితే, వాళ్లకు శిక్ష పడేందుకు సహకరిస్తా. నారాయణరెడ్డికి గన్ మెన్ లను ఎస్పీ ఎందుకు తొలగించారో నాకు తెలియదు. ప్రాణహాని ఉందని నా దృష్టికి తెచ్చి ఉంటే తప్పక రక్షించేవాడిని’ అని అన్నారు.

  • Loading...

More Telugu News