: నారాయణరెడ్డి గన్ లైసెన్స్ రెన్యువల్ చేయని విషయం నాకు తెలియదు: ఎస్పీ రవికృష్ణ
పత్తికొండ వైఎస్సార్సీపీ ఇన్ చార్జి నారాయణరెడ్డి హత్యకు గురైన నేపథ్యంలో కర్నూలు జిల్లా ఎస్పీ రవికృష్ణ మీడియాతో మాట్లాడారు. చాలా బాధాకరమైన సంఘటన అని, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. కొంతకాలంగా కర్నూలు జిల్లాలో ఫ్యాక్షన్ తగ్గుముఖం పట్టిందని, హత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నామని అన్నారు. నారాయణరెడ్డి గన్ లైసెన్స్ రెన్యూవల్ చేయని విషయం తనకు తెలియదని, అధికారుల నుంచి సమాచారం తెలుసుకుంటానని రవికృష్ణ పేర్కొన్నారు.