: భగ్గుమన్న ఫ్యాక్షన్ కక్షలు... పత్తికొండ వైఎస్సార్సీపీ ఇన్ ఛార్జీ నారాయణ రెడ్డి హత్య
రాయలసీమలో మళ్లీ ఫ్యాక్షన్ కక్షలు భగ్గుమన్నాయి. కర్నూలు జిల్లా పత్తికొండ వైఎస్సార్సీపీ ఇన్ ఛార్జీ చెరుకూరిపాడు నారాయణ రెడ్డిని ప్రత్యర్థులు హతమార్చారు. పెళ్లికి వెళ్లి తిరిగి వస్తున్న నారాయణ రెడ్డిని దారి కాసిన ప్రత్యర్థులు కృష్ణగిరి సమీపంలోకి వచ్చేసరికి బాంబులు వేసి భయబ్రాంతులకు గురిచేశారు. అనంతరం వాహనం పంటపొలాల్లోకి దిగిపోవడంతో వాహనం దిగి పరుగెత్తుతున్న నారాయణ రెడ్డిని వేటకొడవళ్లతో నరికి చంపారు. నారాయణ రెడ్డితోపాటు అతని ప్రధాన అనుచరుడు సాంబశివుడిని కూడా హతమార్చారు. కాగా, నారాయణ రెడ్డి గత ఎన్నికల్లో ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తిపై పోటీ చేసి ఓటమిపాలయ్యారు.