: ఎండల ఎఫెక్టు... అప్పడాలు, ఆమ్లెట్లు, చేపల ఫ్రై చేసి యూట్యూబ్ లో పెట్టేస్తున్నారు!


ఎండలు మండిపోతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు తీవ్రమవుతున్నాయి. వివిధ ప్రాంతాల్లో పగటి పూట ఉష్ణోగ్రత 47 డిగ్రీలను తాకుతోంది. ఈ నేపథ్యంలో యువకులు వినూత్నంగా ఆలోచించి, మండుటెండల్లో పెనంపై ఆమ్లెట్లు వేసుకుని వీడియోగా చిత్రీకరించి, సోషల్ మీడియా అయిన యూట్యూబ్ లో అప్ లోడ్ చేస్తున్నారు. మరో వీడియోలో ఒక మహిళ అప్పడాలు వేయించి, చేపలు ఫ్రై చేసేసింది. దీంతో ఈ వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఒడిశాలోని టిట్లాఘడ్ కు చెందిన యువకుడు కూడా 45 డిగ్రీల ఉష్ణోగ్రతలో ఎగ్ ఆమ్లెట్లు వేసి యూట్యూబ్ లో పెట్టగా, 'గ్యాస్ భలే ఆదాచేస్తున్నారు' అంటూ లైకులు, కామెంట్ల వెల్లువ మొదలైంది. ఎండలో ఆమ్లెట్ల తయారీ వీడియోలు మీరు కూడా చూడండి.



  • Loading...

More Telugu News