: నవాజ్ షరీఫ్ కు చెప్పుల దండేసి, బోర్డర్ చుట్టూ పరుగెత్తిస్తే 20 లక్షల రూపాయలిస్తా: ముస్లిం మత పెద్ద ఆఫర్
పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ కు వ్యతిరేకంగా 20 లక్షల రూపాయల బంపర్ ఆఫర్ ను భారత ముస్లిం మత పెద్ద ఒకరు ప్రకటించారు. గతంలో ఆజాన్ (ముస్లింల ప్రాతఃకాల ప్రార్థన) లను తప్పుబట్టిన బాలీవుడ్ సింగర్ సోనూ నిగమ్ పై ఫత్వా జారీ చేసిన కోల్ కతాకు చెందిన ముస్లిం మత పెద్ద సయ్యద్ షా అతీఫ్ అలీ అల్ క్వాదేరి తాజాగా, కుల్ భూషణ్ జాదవ్ చెప్పులను దండగా కూర్చి, పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ మెడలో వేసి, భారత్-పాక్ బోర్డర్ చుట్టూ పరుగెత్తిస్తే వారికి 20 లక్షల రూపాయల బహుమతి ఇస్తానని ప్రకటించారు.
అంతే కాకుండా పాకిస్థాన్ ముస్లిం దేశమని చెప్పుకుంటూ, ఉగ్రవాదానికి, ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తోందని ఆయన మండిపడ్డారు. ప్రధానిగా నవాజ్ షరీఫ్ ఉగ్రవాదంపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని, కానీ ఆయన ఏమీ చేయలేకపోతున్నాడని, ప్రధానిగా ఆయన ఫెయిలయ్యాడని ఆయన తెలిపారు.