: దేవాన్ష్ కు అక్షరాభ్యాసం... తిరుమల చేరిన నారా, నందమూరి కుటుంబాలు!
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మనవడు, మంత్రి నారా లోకేష్ కుమారుడు దేవాన్ష్ కు నేడు అక్షరాభ్యాస వేడుకను నిర్వహించనున్నారు. తిరుమలలోని శ్రీవారి సన్నిధానంలో దేవాన్ష్ కు అక్షరాభ్యాసం చేయించనున్నారు. ఈ నేపథ్యంలో నారా, నందమూరి కుటుంబాలు తిరుమల చేరుకున్నాయి. గత రాత్రి శ్రీవారి సన్నిధిలోనే విశ్రాంతి తీసుకున్న నారా, నందమూరి కుటుంబాలు నేటి ఉదయం 10:30 నిమిషాలకు దేవాన్ష్ కు వేదపండితుల ఆధ్వర్యంలో అక్షరాభ్యాసం జరుగుతుంది. అనంతరం అంతా కలిసి శ్రీవారిని దర్శించుకుంటారు.