: నేను హత్యలు చేయించినట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా: ఎమ్మెల్యే గొట్టిపాటి


తాను గతంలోనూ ఎప్పుడైనా, ఎక్కడైనా హత్యలు చేయించినట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ అన్నారు. నిన్న రాత్రి ప్రకాశం జిల్లా బల్లికురవ మండలం వేమవరంలో జరిగిన జంట హత్యలు కలకలం రేపుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రవికుమార్ ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ.. తమ కుటుంబానికి, ఫ్యాక్షన్‌ గొడవలకు ఎటువంటి సంబంధం లేదని అన్నారు. నిన్న అక్కడ జరిగిన హత్యలు రాజకీయ హత్యలు కావని ఆయ‌న వ్యాఖ్యానించారు. తాను ఇప్ప‌టికి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచాన‌ని, తాను ఎప్పుడూ త‌ప్పు చేయ‌లేద‌ని ఆయ‌న అన్నారు. ఫ్యాక్షన్‌ వలన త‌మ కుటుంబం ఎంతో నష్టపోయింద‌ని అన్నారు. త‌న‌ను కావాలనే కొంద‌రు ల‌క్ష్యంగా చేసుకొని ప‌లు ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని చెప్పారు.

  • Loading...

More Telugu News