: ప్రపంచాన్ని గడగడలాడించినా... వచ్చింది మాత్రం రూ. 53 లక్షలే!
గత వారం రోజులుగా ప్రపంచ వ్యాప్తంగా 'వాన్నాక్రై రాన్సమ్ వేర్' వైరస్ సృష్టించిన భయాందోళనలు అంతా ఇంతా కాదు. సమాచారాన్ని తమ గుప్పిట్లో పెట్టుకుని, సైబర్ నేరగాళ్లు డబ్బు డిమాండ్ చేస్తుండటం తెలిసిందే. అయితే, ఇంత భారీ ఎత్తున సైబర్ దాడి చేసినా, వారు సంపాదించింది మాత్రం అంతంత మాత్రమేనట. భారత కరెన్సీలో కేవలం రూ. 52.85 లక్షలు (82 వేల డాలర్లు) మాత్రమే నేరస్తులకు చేరాయని అంతర్జాతీయ సైబర్ నేర పరిశోధన సంస్థలు తెలిపాయి. సైబర్ దాడికి పాల్పడిన వారిని త్వరలోనే పట్టుకుంటామని చెబుతున్నారు. డబ్బులు ఎక్కడి నుంచి ఎక్కడకు బదిలీ అవుతున్నాయో క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని... తద్వారా నేరస్తులను గుర్తించి, అరెస్ట్ చేస్తామని తెలిపాయి.