: పెట్రోల్ బంక్‌లో అగ్ని ప్రమాదం.. ఒకరి మృతి
పెట్రోల్ బంక్‌లో అగ్ని ప్రమాదం సంభవించి, ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన సూరత్‌లో చోటు చేసుకుంది. ఓ బైక్‌లో పెట్రోల్ నింపుతున్న సమయంలో అనుకోకుండా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బైక్ తగులబడిపోతుండడంతో అక్కడున్న వారంతా మంటలను ఆర్పేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. ఇక లాభం లేదనుకుని, దూరంగా జరిగారు. అయితే, పెట్రోల్ బంక్‌లో పనిచేస్తున్న రాజ్‌కుమార్ అనే ఉద్యోగి మంటలను అదుపుచేసేందుకు అగ్నిమాపక సిలిండర్‌ను తెరుస్తుండగా అది ఒక్కసారిగా పేలడంతో, దానికి సంబంధించిన ఓ మేకు రాజ్‌కుమార్ మెడకు గుచ్చుకుంది. దీంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. అతడిని ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు.