: సరబ్ జిత్ సింగ్ అంత్యక్రియలు పూర్తి
పాకిస్తాన్ జైలులో తోటి ఖైదీల పాశవిక దాడిలో దుర్మరణం పాలైన భారతీయుడు సరబ్ జిత్ సింగ్ కు ఈ రోజు పంజాబ్ లోని అతని స్వగ్రామం 'బిఖ్ విండ్'లో అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్, కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతోపాటు చాలామంది ముఖ్య నేతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.