: రాయలసీమను రతనాల సీమ చేయాలని సంకల్పించా: సీఎం చంద్రబాబు


రాయలసీమ రాళ్ల సీమ అని ఇన్నాళ్లూ నాయకులు ప్రచారం చేశారని, ఆ రాళ్లసీమను రతనాల సీమ చేయాలని తాను సంకల్పించానని సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. చిత్తూరు జిల్లా పర్యటనలో ఉన్నచంద్రబాబు మాట్లాడుతూ, దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు రుణమాఫీ చేశామని, రుణమాఫీకి రూ.24 వేల కోట్లు కేటాయించిన ప్రభుత్వం తమదని, డ్వాక్రా మహిళలకు రెండు విడతలుగా రుణమాఫీ చేశామని అన్నారు. ఈ ఏడాది పది లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామని చెప్పారు. ‘నీరు ఉంటేనే భవిష్యత్, నీటిని పొదుపుగా వాడుకోవాలి. పంట కుంటలతో నీటి ఎద్దడిని నివారించవచ్చు. పట్టిసీమను రికార్డు సమయంలో పూర్తి చేశాం. రాయలసీమకు నీళ్లిచ్చాం’ అని చంద్రబాబు అన్నారు.

  • Loading...

More Telugu News