: వైఎస్ జగన్ కు తమ గోడు వెళ్లబోసుకున్న ఉద్ధానం కిడ్నీ బాధితులు


శ్రీకాకుళం జిల్లా జగతి గ్రామంలోఉద్ధానం కిడ్నీ బాధితులతో జగన్ ముఖాముఖి మాట్లాడారు. ఈ సందర్భంగా కిడ్నీ బాధితులు తమ గోడును జగన్ తో వెళ్లబోసుకున్నారు. కిడ్నీ బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం  విఫలమైందని, తమ సమస్యను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని బాధితులు జగన్ తో వాపోయారు. విశాఖపట్టణం వెళ్లి వైద్యం చేయించుకోలేకపోతున్నామని, డయాలసిస్ కు నెలకు ఒక్కొక్కరికీ రూ.15 నుంచి 20 వేలు ఖర్చు అవుతోందని, ఆర్థిక స్తోమత లేక ప్రాణాలు విడుస్తున్నారని కిడ్నీ బాధితులు జగన్ దృష్టికి తెచ్చారు. బాధితులకు అండగా ఉంటామని ఈ సందర్భంగా జగన్ వారికి హామీ ఇచ్చారు. 

  • Loading...

More Telugu News