: అరగంటపాటు ఆగిపోయిన ట్విట్టర్.. ప్రపంచవ్యాప్తంగా ఆగిపోయిన సేవలు!
మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా అరగంటపాటు మొరాయించింది. లాగిన్ అయ్యేందుకు యూజర్లు ఇబ్బందులు పడ్డారు. ‘సాంకేతిక పొరపాటు’ పేరుతో మెసేజ్ కనిపించడంతో వినియోగదారులు కంగుతిన్నారు. జపాన్, అమెరికా, బ్రిటన్‌లోని కొన్ని ప్రాంతాల్లో ట్విట్టర్ సేవలకు కొన్ని నిమిషాలపాటు అంతరాయం కలిగినట్టు డౌన్ డిటెక్టర్ అనే సంస్థ తెలిపింది.
భారత్ విషయానికొస్తే, బెంగళూరులో ట్విట్టర్ బాగా ఇబ్బంది పెట్టింది. హైదరాబాద్, చెన్నై, అహ్మదాబాద్, ఢిల్లీ, లక్నోలోనూ సమస్య ఎదురైంది. ఒక్క వెబ్‌సైటే కాదు, మొబైల్ యాప్‌లోనూ ట్విట్టర్ సేవలు నిలిచిపోయాయి. ట్విట్టర్ సేవలకు అంతరాయం కలగడంతో ఇది బహుశా వైరస్ ప్రభావమేమోనని కొందరు నెటిజన్లు అనుమానం వ్యక్తం చేశారు. అయితే 35 నిమిషాల్లో సేవలు తిరిగి అందుబాటులోకి రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.