: ఐపీఎల్: కోల్‌కతా ఇంటికి.. ముంబై ఇండియన్స్ హైదరాబాద్‌కు.. ఫైనల్స్‌కు చేరిన రోహిత్ సేన!


క్వాలిఫయర్-1 మ్యాచ్‌లో రైజింగ్ పుణె సూపర్ జెయింట్ చేతిలో అనూహ్యంగా ఓటమి పాలైన ముంబై, క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో పుంజుకుని కోల్‌కతాను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. రేపు (ఆదివారం) హైదరాబాద్‌లో జరగనున్న ఫైనల్‌లో రైజింగ్ పుణె సూపర్ జెయింట్‌తో తలపడేందుకు సిద్ధమైంది. బ్యాటింగ్, బౌలింగ్ రంగాల్లో సత్తా చాటిన ముంబై ఇండియన్స్ కోల్‌కతా నిర్దేశించిన 108 పరుగుల స్వల్వ లక్ష్యాన్ని 14.3 ఓవర్లలో నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. ముంబై విజయంలో కృనాల్  పాండ్య (30 బంతుల్లో 45 నాటౌట్), రోహిత్‌శర్మ (24 బంతుల్లో 26) కీలకపాత్ర పోషించారు. తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా కర్ణ్‌శర్మ (4/16), బుమ్రా (3/7) ధాటికి 18.5 ఓవర్లలో 107 పరుగులకే కుప్పకూలింది.

  • Loading...

More Telugu News