: విచారణలో అధికారులు అడిగే ప్రశ్నలను నాకు ముందుగానే తెలపాలి: శశికళ పిటిషన్
అక్రమాస్తుల కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి వీకే శశికళ తాజాగా ఎగ్మూరు న్యాయస్థానంలో ఓ అభ్యర్థన పెట్టుకున్నారు. విదేశీ మారకద్రవ్యం మోసం కేసుకు సంబంధించి, తనను ఈడీ అధికారులు అడగాలనుకుంటున్న ప్రశ్నలను తనకు ముందుగానే తెలపాలని ఆమె కోరారు. ఇటీవలే శశికళ వాంగ్మూలాన్ని నమోదు చేసేందుకు వీలుగా ఆమెను కోర్టుకు తీసుకురావాలని కోర్టు ఆదేశించింది.
అయితే, జైల్లో తాను అనారోగ్యంతో ఉన్నానని, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వాంగ్మూలాన్ని రికార్డు చేస్తానని ఆమె తన తరపు న్యాయవాదితో పిటిషన్ వేయించారు. ఈ నేపథ్యంలోనే పై విధంగా శశికళ కోర్టులో మరో అభ్యర్థన పెట్టుకున్నారు. అయితే, ఈడీ తరపు న్యాయవాది ఇందుకు అభ్యంతరం తెలిపారు. కోర్టు ఈ కేసులో తదుపరి విచారణను వచ్చేనెల 2వ తేదీకి వాయిదా వేసింది.