: కారు డోర్ లాక్.. ఊపిరాడక చిన్నారి మృతి.. మరో చిన్నారి పరిస్థితి విషమం
కారు డోర్ లాక్ కావడంతో ఓ చిన్నారి మృతి చెందిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం ఇల్లందు మండలం మాణిక్యారంలో చోటుచేసుకుంది. మరో చిన్నారి పరిస్థితి విషమంగా ఉంది. వివరాల్లోకి వెళితే... ఈ రోజు జ్ఞాపికశ్రీ, అభివిక అనే ఐదేళ్లలోపు చిన్నారులు తమ ఇంటి ముందు కారులో ఆడుకుంటున్నారు. ఆ సమయంలో పెద్దలు ఎవ్వరూ లేరు. ఇంతలో కారు లాక్ అయిపోయింది. ఈ విషయాన్ని వారి తల్లిదండ్రులు వచ్చి గమనించేలోపే జ్ఞాపికశ్రీ ఊపిరి ఆడక అక్కడికక్కడే కారులోనే ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనలో ఆమెతో పాటు కారులో ఉండిపోయిన అభివిక కొనఊపిరితో ఉండడంతో ఆమెను ఆసుపత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆ చిన్నారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు.