: నా కుమారుడు తిరిగొస్తాడు!: చిదంబరం
తన కుమారుడు కార్తి చిదంబరం కొన్ని రోజుల తరువాత తిరిగి ఇండియాకు వస్తాడని మాజీ హోం, ఆర్థికమంత్రి చిదంబరం వెల్లడించారు. కార్తి లండన్ కు చెక్కేశారని, మరో మాల్యా అయ్యారని మీడియాలో వస్తున్న వార్తలపై చిదంబరం స్పందించారు. కార్తి లండన్ ప్రయాణం ముందుగా ప్లాన్ చేసుకున్నదేనని, టికెట్లు కూడా ఎప్పుడో కొన్నవేనని వెల్లడించిన చిదంబరం, ఆయన ప్రయాణంపై ఎటువంటి నిషేధాలు లేవని గుర్తు చేశారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం తన కుటుంబంపై రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే సీబీఐని ప్రయోగించిందని, కార్తితో పాటు అతని స్నేహితులనూ ఇబ్బంది పెట్టడమే వారి లక్ష్యమని చిదంబరం ఆరోపించారు.