: పేకాట ఆడుతూ అడ్డంగా బుక్కైన ఎస్సై, ఇంజినీర్!
పేకాట ఆడుతున్నారన్న పక్కా సమాచారంతో పేకాట స్థావరంపై దాడి చేసిన పోలీసులే నిశ్చేష్టులయ్యారు. పేకాటరాయుళ్లలో ఓ ఎస్సై, ఓ డిప్యూటీ ఇంజినీర్ ఉండటమే దానికి కారణం. వివరాల్లోకి వెళ్తే, పశ్చిమగోదావరి జిల్లాలోని టి.నర్సాపురం మండలం బర్రంపాలెంలో పేకాట ఆడుతున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. దీంతో, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేశారు. ఈ సందర్భంగా మొత్తం ఎనిమిది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టైన వారిలో ఓ ఎస్సై, ఇంజినీర్ కూడా ఉన్నారు. వీరి వద్ద నుంచి రూ. 72 వేల నగదు, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.